Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీర్ బాటిల్ లో చేప పిల్ల..మద్యం ప్రియుడికి షాక్

బీర్ బాటిల్ లో చేప పిల్ల..మద్యం ప్రియుడికి షాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని మల్లాపూర్లో ఒక మద్యం ప్రియుడు వైన్ షాపులో కొనుగోలు చేసిన కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో చేప పిల్ల కనిపించడంతో షాకయ్యాడు. వైన్ షాపు నిర్వాహకులు తమది అమ్మకం మాత్రమేనని, కింగ్ ఫిషర్ పరిశ్రమను ప్రశ్నించాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గతంలో బీర్ బాటిళ్లలో చెత్త, పురుగులు కనిపించిన సంఘటనలు ఉన్నా, చేప పిల్ల కనిపించడం మద్యం ప్రియులను నివ్వెరపరిచింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని డిస్టిలరీస్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -