Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన బేబీ ఆఫ్ కవిత కుటుంబ సభ్యులు 

డాక్టర్ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన బేబీ ఆఫ్ కవిత కుటుంబ సభ్యులు 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్  : బాన్సువాడకు చెందిన దేవి ఆఫ్ కవిత కుటుంబ సభ్యులు శుక్రవారం నగరంలోని శ్రీ మహాలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ హరికృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. సుమారుగా 8 సంవత్సరాల క్రితం  బేబీ ఆఫ్ కవితగా కవిత కి జన్మించిన ఈ పాప 34 వారాల్లో బరువు తక్కువగా జన్మించి ప్రాణాపాయ పరిస్థితిలో ఇతర హాస్పటల్ సిబ్బంది హైదరాబాద్ కు రిఫర్ చెయ్యగా శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రికి అర్థరాత్రి సమయంలో తీసుకురావడం జరిగిందని డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఆ పాపకు ఐ సి యూ లో వెంటిలేటర్, నూతన చికిత్స విధానంతోచికిత్స అందించి పిదప, స్వస్థత పొందడం జరిగిందని వివరించారు. ఈ ఆనందకరమైన విషయాన్ని బేబీ యొక్క తండ్రి వచ్చి తన ప్రేమను కృతజ్ఞతా భావంతో శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి యాజమాన్యంతో పంచుకున్నారు. ఇలాంటి తల్లిదండ్రుల దీవెనలతో మేము ముందు ముందు ఉత్సాహంగా పనిచేయడానికి హైరిస్ కేసెస్ టేక్ అప్ చేయడానికి దోహదపడతాయి అని ఎంబిబిఎస్ డిసిహెచ్ (నిలోఫర్) డాక్టర్ జి హరికృష్ణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -