Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్‌ విడుదల

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్‌ విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్లో చూపించిన విజువల్స్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. “బ్యాడ్ బాయ్ అనుకుంటే.. స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్!” అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో నాగశౌర్య ఎనర్జిటిక్ మాస్ అవతారాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు నాగశౌర్య చేసిన‌ సాఫ్ట్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా, ఈసారి యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నారు. విధి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుపుతున్న ఈ చిత్రం, ఆ బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం విశేషం.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ త్వరలో విడుదల కానుంది. మరి సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. యూత్‌ ఫుల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -