Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుబ్యాడ్‌ వెదర్‌..ఆగిన ఐదో టీ20

బ్యాడ్‌ వెదర్‌..ఆగిన ఐదో టీ20

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌ బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్నది. టాస్‌ బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. 4.5 ఓవర్లలో టీమిండియా వికెట్ల నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాడ్‌ వెదర్‌ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ 13 బంతుల్లో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగగా.. టీమిండియా తిలక్‌ వర్మ స్థానంలో రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -