Thursday, January 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎన్‌టీవీ సీనియర్ జర్నలిస్ట్‌లకు బెయిల్..

ఎన్‌టీవీ సీనియర్ జర్నలిస్ట్‌లకు బెయిల్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ఎన్‌టీవీ ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్‌ (ఇన్‌పుట్ ఎడిటర్), సుధీర్‌ (రిపోర్టర్)లకు మేజిస్ట్రేట్ కోర్టులో ఊరట లభించింది. వీరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఇటీవల ప్రసారమైన ఓ వివాదాస్పద కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు పలువురు జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

దొంతు రమేష్‌ను హైదరాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, సుధీర్‌ను ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. జర్నలిస్టుల అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.

నిన్న వీరిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి పోలీసులు రిమాండ్ కోరారు. అయితే ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు సమయంలో నోటీసులు ఇవ్వకపోవడం వంటి విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంటాయని పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించి, బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -