నవతెలంగాణ పుణె: మదుపరులకు ఆవిష్కరణ, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, దీర్ఘ కాలిక విలువ సృష్టి పట్ల తన నిబద్ధతతో, బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. ప్రారంభించిన రెండేళ్లలో తన మ్యూచువల్ ఫండ్ పథకాలలో 1 మిలియన్ మదుపరుల ఫోలియోల మార్కును దాటింది. ఈ విజయం బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సుస్థిర పురోగతి, పెరుగుతున్న మదుపరుల నమ్మకం, విభిన్న పెట్టుబడి ఉత్పత్తులను అందించడంపై దృష్టిని ప్రతిబింబిస్తుం ది.
ఈ మైలురాయి గురించి బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ మోహన్ మాట్లాడుతూ, “1 మిలియన్ ఫోలియోల మైలురాయిని దాటడం మాకు మాత్రమే కాదు, మా మదుపరు లకు కూడా ఒక ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది. ఇది మా ఇన్వెస్టర్ – ఫస్ట్ తాత్వికతను, పనితీరు-ఆధారిత ఉత్పత్తులపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. వ్యక్తులు తమ ఆర్థిక ఆకాంక్షలను సాధించడా నికి శక్తినిచ్చే పారదర్శక, పరిశోధన-ఆధారిత మదుపు వ్యూహాలను అందించడంలో మా నిబద్ధతలో మేం స్థిరంగా ఉన్నాం. పరిమాణాత్మక విశ్లేషణలతో మానవ నైపుణ్యాన్ని సమగ్రపరచడం ద్వారా మేం మార్కెట్ సంక్లిష్టతలను కచ్చితత్వంతో నావిగేట్ చేస్తాం. ఎల్లప్పుడూ మా నిర్ణయాలలో మదుపరులకు దక్కే ఫలితాలను కేంద్రబిందువుగా ఉంచుతాం. ఈ మైలురాయి మమ్మల్ని మేం మరింతగా ఆవిష్కరించుకోడానికి, మా సేవలను మెరుగుపరచడానికి, మదుపరుల సమూహంతో మా నిమగ్నతను బలోపేతం చేయడానికి ప్రేరేపి స్తుంది’’ అని అన్నారు.
వినూత్నత, గెలుపు-గెలుపు భాగస్వామ్యాలు, డేటా, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి నడిచే భవిష్యత్తు సన్నద్ధక వ్యాపార నమూనాపై కంపెనీ వ్యూహం ఆధారపడి ఉంటుంది. డిజిటల్ ఎనేబుల్‌మెంట్‌పై దృష్టి, వాట్సాప్, ఎంపవర్, సేవింగ్స్+ వంటి విభిన్న ఛానెల్‌ల ద్వారా మదుపరులకు సంస్థతో పని చేసే అను భూతిని సజావుగా అందించడం భౌగోళిక ప్రాంతాలలో విభిన్న మదుపరుల బేస్‌ను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీని నిజంగా విభిన్నంగా ఉంచేది దాని ఇన్వెస్ట్మెంట్ తాత్వికత. ఇది ‘INQUBE’ అనే యాజమాన్య చట్రంలో అన్ని ఆల్ఫా వనరులను – ఇన్ఫర్మేషన్ ఎడ్జ్, క్వాంటిటేటివ్ ఎడ్జ్ బిహేవిరియల్ ఎడ్జ్ లను – కలపడానికి ప్రయత్నిస్తుంది.
జూన్ 2023లో తన మొదటి పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి, బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ పరిమాణం, పరిధి రెండింటిలోనూ గణనీయంగా అభివృద్ధి చెందింది. మొత్తం ఏయూఎం ₹28,814.16 కోట్లు (సెప్టెంబర్ 30, 2025 నాటికి)*. అదే సమయంలో, కంపెనీ ఆర్థిక చేకూర్పు, దీర్ఘకాలిక సంపద సృష్టి అనే తన లక్ష్యంపై నిర్మితం కావడాన్ని కొనసాగిస్తోంది. మదుపరుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా విభిన్న మ్యూ చువల్ ఫండ్ పథకాలను అందిస్తోంది. తక్కువ వ్యవధిలో, ఫండ్ హౌస్ ఇప్పటికే 17 యాక్టివ్ పథకాలను (8 ఈక్విటీ, 5 డెట్, 4 హైబ్రిడ్) నిర్వహిస్తోంది, వాటితో పాటు 5 పాసివ్ పథకాలు కూడా ఉన్నాయి.

 
                                    