Saturday, May 3, 2025
Homeసినిమా'బకాసుర రెస్టారెంట్‌'

‘బకాసుర రెస్టారెంట్‌’

హాస్యనటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భకాసుర రెస్టారెంట్‌’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబందం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ప్రవీణ్‌ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. వైవా హర్ష, షైనింగ్‌ ఫణి మరో వైపు విచిత్రంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌ పాత్రలుగా కనిపిస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, ‘హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాలు అలరించే అంశాలున్నాయి. ప్రతి సన్నివేశం అందరికి ఎంతో థ్రిల్‌ను పంచు తుంది. ప్రవీణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ఇది ఉండబోతుంది. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకష్ణ, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినరు కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్‌: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img