Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపిల్లల్లో సృజనాత్మకతనుపెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

పిల్లల్లో సృజనాత్మకతనుపెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

- Advertisement -

– తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవ్‌ సమ్మర్‌ క్యాంప్‌ ప్రారంభం
నవతెలంగాణ – ముషీరాబాద్‌

సమ్మర్‌ క్యాంప్‌ పిల్లల్లో సృజనాత్మకతను, ఊహించే శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుందని తెలంగాణ బాలోత్సవ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం తెలంగాణ బాలోత్సవ సమ్మర్‌ క్యాంప్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పిల్లల కోసం నిర్వహించే ఒక సరదా, వినోదభరితమైన శిబిరం సమ్మర్‌ క్యాంప్‌ అన్నారు. ఈ శిబిరాలలో పిల్లలు వివిధ రకాల ఆటలు, ఇతర కార్యకలాపాలలో పాల్గొంటారని, ఇవి వారిని సృజనాత్మకంగా, శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంచుతాయని అన్నారు. సమ్మర్‌ క్యాంప్‌తో వివిధ నైపుణ్యాలను నేర్చుకోవచ్చన్నారు. పాఠశాలకు, సమ్మర్‌ క్యాంప్‌కు స్పష్టమైన తేడా ఉందని తెలిపారు. నృత్యం, పాడటం, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ ఇతర కళలు ఈ సమ్మర్‌ క్యాంప్‌లో నేర్చుకోవచ్చని చెప్పారు. అలాగే, పిల్లలు కొత్త స్నేహితులను ఏర్పరచుకోవచ్చని, ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకోవచ్చని తెలిపారు. సమ్మర్‌ క్యాంప్‌లో నిర్వహించే కొన్ని కార్యకలాపాలను వివరించారు. పిల్లలు వివిధ రకాల కళలు, క్రాఫ్ట్‌లలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, పిల్లలు బహిరంగంగా విహరించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్‌.సోమయ్య, కవయిత్రి రూపా రుక్మిణి, దివ్య, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad