Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంరఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ నామినేష‌న్

రఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ నామినేష‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

గతంలో రఘోపూర్ నుంచి తేజస్వీ తల్లిదండ్రులు సీఎంలుగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీలు పోటీ చేశారు. 35 ఏళ్ల తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, తండ్రి లాలూ సమక్షంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సమయంలో ఆయనకు ఆర్జేడీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. 20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఆర్జేడీ అధికారంలోకి రావడానికి భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -