Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లపై జాగృతి పోరాడుతుంది: ఎమ్మెల్సీ కవిత

బనకచర్లపై జాగృతి పోరాడుతుంది: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచర్లను తక్షణమే ఆపాలి.. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అఖిలపక్షాన్ని సీఎం దిల్లీకి తీసుకెళ్లాలి’ అని కవిత డిమాండ్‌ చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ నిర్ణయాన్ని సమర్థించినట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్‌ చేసింది కూడా తానేనని గుర్తుచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌.. గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి? సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి?. టెలీమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు.. కానీ, సీఎం దాన్ని తమ విజయంగా చెబుతున్నారని విమ‌ర్శించారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -