హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ జారుఫుల్ బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించారు.
కోన వెంకట్ మాట్లాడుతూ,’చెన్నై బీచ్‌లో ఓసారి కాళ్లు, చేతులు లేని ఓ అమ్మాయి బెలూన్స్ అమ్ముకుంటూ కనిపించింది. ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అలాంటప్పుడే ఆ అమ్మాయిని చూశాను. కాళ్లు, చేతులు లేకపోయినా, రేపటి భవిష్యత్తు ఏంటో తెలియక పోయినా ఆ అమ్మాయి హాయిగా బతికేస్తోంది.. నేను ఎందుకు చనిపోవాలి? అని అనుకున్నాను. ఆ తరువాత రైటర్‌గా మారి ఎన్నో సినిమాలు రాశాను. నిర్మాతగా ఎంతో మందిని పరిచయం చేశాను. ఇదంతా కూడా ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది. పది మందిలో ఒకరికి నచ్చకపోవచ్చు. ఆ ఒక్కరి గురించి పట్టించుకోవద్దని టీంకు చెప్పాను. ఎన్నో కష్టాలు దాటుకుని ఈ సినిమా హిట్టుగా నిలిచింది. ప్రేక్షకుల వల్లే ఇంత పెద్ద విజయం సాధించింది. థియేటర్లోకి వెళ్లినప్పుడు ఆడియెన్స్ మొహంలో ఓ సంతప్తిని చూశాను. రోషన్, శ్రీదేవీ ఇలా ఎంతో మంది లైఫ్ ఈ చిత్రంతో ముడి పడి ఉంది. వీళ్ళిద్దరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టించేశారు. ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ ఇకపై ఆడిషన్స్ అవసరం లేదు.. ‘బ్యాండ్ మేళం’ విజిటింగ్ కార్డ్‌లా ఉంటుంది. ఈ మూవీని మరాఠీలోనూ రిలీజ్ చేయబోతోన్నాం’ అని చెప్పారు.
మరాఠిలోనూ ‘బ్యాండ్ మేళం’
- Advertisement -
- Advertisement -



