- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.
- Advertisement -



