Saturday, October 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో బంద్...

ముధోల్ లో బంద్…

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ :  తెలంగాణ రాష్ట్రం లో బిసి రిజర్వేషన్ ను అమలు చేయాలని రాష్ట్ర బిసి జేఏసీ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బిసి సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయా పార్టీల బాధ్యులు,బిసి సంఘంల నాయకులు కలిసి శనివారం ముధోల్ లో బంద్ నిర్వహించారు.వ్యాపారస్తులు , పాఠశాలల యాజమాన్యాలు స్వచ్చందంగా బంద్ కు మద్దతు పలికారు. బంద్ తో వ్యాపార దుకాణాలు మూసిఉండటంతో రోడ్డులు నిర్మానుషంగా కనిపించాయి. బిసి రిజర్వేషన్ లు అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం ఐక్యవేదిక నాయకులు రోళ్ళ రమెష్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, బిడిసి అధ్యక్షుడు విఠల్, నాయకులు బోయిడి అనిల్, కిష్టయ్య,వంశీ, రమేష్, శ్రీనివాస్, జీవన్, నారాయణ, సాయినాథ్, దేవోజీ భుమేష్, పోతన్న యాదవ్, దశరథ్, దత్తాద్రి, సుభాష్, రావుల శ్రీనివాస్, మోహన్ యాదవ్, జిందావార్ వెంకటేష్, గణేష్, బిసి సంఘాల నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -