Friday, May 2, 2025
Homeబీజినెస్బంధన్ బ్యాంక్ మొత్తం వ్యాపారం 11 శాతం వృద్ధితో రూ. 2.88 లక్షల కోట్లకు చేరిక

బంధన్ బ్యాంక్ మొత్తం వ్యాపారం 11 శాతం వృద్ధితో రూ. 2.88 లక్షల కోట్లకు చేరిక

·       మొత్తం డిపాజిట్లు YoY ప్రాతిపదికన 12% పెరిగి రూ. 1.51 లక్షల కోట్లకు చేరిక

·       మొత్తం డిపాజిట్లలో రిటైల్ వాటా సుమారు 69%

·       31.4% శాతంగా CASA నిష్పత్తి

·       మొత్తం లోన్ బుక్ YoY ప్రాతిపదికన 10% వృద్ధి చెంది రూ. 1.37 లక్షల కోట్లకు చేరిక

కోల్‌కతా: 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి గాను బంధన్ బ్యాంక్ తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వీటి ప్రకారం బ్యాంక్ మొత్తం వ్యాపారం 11 శాతం పెరిగి రూ. 2.88 లక్షల కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లలో రిటైల్ వాటా ప్రస్తుతం సుమారు 69 శాతంగా ఉంది. విస్తృతమైన నెట్‌వర్క్, మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యాపార పరిస్థితులు మొదలైన అంశాలు ఆఖరు త్రైమాసికంలో వృద్ధికి దన్నుగా నిల్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 2,745 కోట్లుగా నమోదైంది.
బ్యాంకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను ముప్ఫై అయిదింటిలో 6,300 పైగా బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ ద్వారా 3.15 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. బంధన్ బ్యాంకులో సుమారు 75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. FY25 Q4లో వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ బేస్ 12% శాతం వృద్ధి చెంది ప్రస్తుతం రూ. 1.51 లక్షల కోట్లకు చేరింది. ఇదే వ్యవధిలో మొత్తం అడ్వాన్స్‌లు రూ. 1.37 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ మరియు సేవింగ్స్ అకౌంట్ (CASA) నిష్పత్తి ఆరోగ్యకరమైన స్థాయిలో 31.4% శాతంగా ఉంది. బ్యాంకు యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్), నియంత్రణ సంస్థ నిర్దేశించిన దానికన్నా అధికంగా 18.7% శాతం స్థాయిలో పటిష్టంగా ఉంది. “పటిష్టమైన గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, భాగస్వాముల విశ్వసనీయత వంటి అంశాల దన్నుతో బంధన్ బ్యాంక్ సమతుల్యమైన, సుస్థిరమైన వృద్ధిని, పనితీరును సాధించగలిగింది. బంధన్ బ్యాంక్ 2.0గా ఎదిగే క్రమంలో కస్టమర్ ఆధారిత, డిజిటల్-ఫస్ట్ సొల్యూషన్స్, పంపిణీని విస్తరించడం, అసెట్స్ డైవర్సిఫికేషన్, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించడంలాంటి అంశాలపై మరింతగా దృష్టి పెట్టనున్నాం. తద్వారా దీర్ఘకాలిక విలువతో పాటు భవిష్యత్ వృద్ధిని కూడా సాధించనున్నాం” అని బ్యాంక్ ఎండీ & సీఈవో పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు. రిటైల్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం లక్ష్యంగా అసెట్ బేస్‌లో వైవిధ్యం సాధించడంపై బ్యాంక్ మరింతగా దృష్టి పెట్టనుంది. సామర్థ్యాలను, ఉత్పాదకతను మెరుగుపర్చుకునేందుకు, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేలా డిజిటైజేషన్‌ను వేగవంతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img