నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకుంది. ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించారు. ఈ విషయంపై మంత్రి జహీర్ ఉద్దీన్ మాట్లాడుతూ.. “ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటివరకు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావాలని మేము కోరుకోవడం లేదు. దీనిని మేము వాణిజ్యపరంగానే పరిశీలిస్తాం. ఏదైనా ఛానెల్ ప్రసారాల కోసం దరఖాస్తు చేసుకుంటే, సానుకూలంగా పరిశీలిస్తాం” అని డ్యుయిష్ వెల్లెకు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని ఆయన స్పష్టం చేశారు.
ఐపీఎల్ పై తన వైఖరి మార్చుకున్న బంగ్లాదేశ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



