నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల ఫిబ్రవరి 7 నుంచి భారత్-శ్రీలంక వేదికగా ప్రారంభకానున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(బీసీబీ) అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లేకపోతే బంగ్లా స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తామని పేర్కొంది. తాజాగా ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిప్ నజూరల్ స్పందించారు.
ఐసీసీ నిబంధనలను తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. భారత్ క్రికెట్ బోర్డు ఒత్తిడి మేరకు తమపై ఒత్తిడి పెంచుతున్నారని, ఐసీసీ తమపై ఆమోదయోగ్యంగాని షరతులు విధిస్తోందని మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇండియా కూడా పాకిస్థాన్ వేదికగా క్రికెట్ ఆడేందుకు నిరాకరిస్తే..ఐసీసీ సానుకూలంగా స్పందించి వేదికలను మార్చారని గుర్తు చేశారు. సరైన కారణంతోనే భారత్‌లో ఆడేందుకు నిరాకరించామని, శ్రీలంక వేదికగా తమ మ్యాచ్‌లను ఆడించాలని తమ దేశ క్రికెట్ బోర్డు కోరిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ లో తమ జట్టు బృందం ఆడే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు.



