Sunday, January 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు భారీ షాక్

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు భారీ షాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కోల్కత్తా నైట్రైడర్స్ టీం మేనేజ్ మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్, పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను రిలీజ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పేట్రేగిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెటర్కు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని భావించి..ఆ ప్లేయ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని కేకేఆర్ టీంను బీసీసీఐ కోరింది. ముస్తఫిజుర్ రెహ్మాన్ను వదిలేసుకున్న క్రమంలో రీప్లేస్మెంట్ కోరేందుకు కేకేఆర్ జట్టుకు అవకాశం ఇస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో బోర్డు ప్ర‌తిపాద‌న‌ను కేకేఆర్ అంగీక‌రించి, ముస్త‌ఫిజ‌ర్‌ణు రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో నిలిచిన ముస్తఫిజుర్ను 9.20 కోట్లకు కేకేఆర్ జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న పేస్ బౌలర్ కావడంతో ముస్తఫిజుర్ కోసం చెన్నై, ఢిల్లీ జట్లు కూడా పోటీ పడగా కేకేఆర్ అత్యధిక ధరకు ఈ బంగ్లా పేసర్‌ను దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -