- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. శాంతిభద్రతల నిర్వహణలో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తీవ్రవాదశక్తులు మళ్లీ పుంజుకునేందుకు ఆయన అనుమతి ఇస్తున్నట్లు ఆరోపించారు. తాను ప్రధాని పదవి నుంచి వైదొలిగినప్పటినుంచి పరిస్థితి మరింత దిగజారిందన్నారు. నిరంతర హింస బంగ్లాదేశ్‌ను అంతర్గతంగా అస్థిరపరుస్తోందన్నారు. పొరుగు దేశాలతో.. ముఖ్యంగా భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తోందని హెచ్చరించారు.
- Advertisement -



