Sunday, January 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాలో మూక‌దాడి..ఖోకోన్‌ దాస్ మృతి

బంగ్లాలో మూక‌దాడి..ఖోకోన్‌ దాస్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌ లో మైనార్టీలైనా హిందువులపై దాడుల జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబర్ 31న 50 ఏండ్ల వ్యక్తి ఖోకోన్‌ దాస్‌ పై ఓ బృందం దాడి చేసింది. పదునైన ఆయుధాలతో గాయపరిచింది. అనంతరం నిప్పటించింది. ఈ దాడిలో ఖోకోన్‌ దాస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మ‌ర‌ణించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో ఘటన. అంతకుముందు అంటే డిసెంబర్‌ 18వ తేదీన భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపింది. డిసెంబర్‌ 30న కూడా మైమెన్‌సింగ్‌ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -