No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఆటలుబంగ్లా, శ్రీలంక తొలి టెస్టు డ్రా

బంగ్లా, శ్రీలంక తొలి టెస్టు డ్రా

- Advertisement -

నజ్ముల్‌ శాంటో అజేయ సెంచరీ
గాలె (శ్రీలంక) :
ఆసక్తికరంగా సాగిన బంగ్లాదేశ్‌, శ్రీలంక తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరు రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించినా.. డిక్లరేషన్‌ ప్రకటించి ఆతిథ్య శ్రీలంకను ఛేదనకు ఆహ్వానించిన బంగ్లాదేశ్‌ గాలె టెస్టుకు ఉత్కంఠను జోడించింది. 296 పరుగుల ఛేదనలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 72/4తో నిలిచింది. తైజుల్‌ ఇస్లామ్‌ (3/23) మూడు వికెట్లతో మెప్పించాడు. శ్రీలంక బ్యాటర్లలో పతుం నిశాంక (24) ఫర్వాలేదనపించగా.. లహిరు (9), చండిమాల్‌ (6), మాథ్యూస్‌ (8) తేలిపోయారు. మెండిస్‌ (12 నాటౌట్‌), ధనంజయ డిసిల్వ (12 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. ఆఖరు రోజు ముగియటంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను 285/7 పరుగులకు డిక్లరేషన్‌ ఇచ్చింది. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (125, 199 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరిశాడు. ముష్ఫీకర్‌ రహీమ్‌ (49) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 495 పరుగులు చేయగా, శ్రీలంక 485 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన నజ్ముల్‌ శాంటో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. బంగ్లాదేశ్‌, శ్రీలంక రెండో టెస్టు బుధవారం నుంచి కొలంబోలో జరుగుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad