- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వారానికి 5 రోజుల పని అమలుకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెకు దిగనున్నారు. ఇటీవల చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీ, యూనియన్ తదితర బ్యాంకుల సేవల్లో ఈరోజు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ యూనియన్లలో లేని HDFC, ICICI, యాక్సిస్ వంటి బ్యాంకుల సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.
- Advertisement -



