నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది. డిసెంబర్‌లో దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 18 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. వీటితో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్లను సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
సెలవుల జాబితా ఇదే..
డిసెంబర్ 1 : అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్ర అవరతణ దినోత్సవం సందర్భంగా సెలవు
డిసెంబర్ 3 : సెయింట్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలో సెలవు.
డిసెంబర్ 7 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా హాలీడే.
డిసెంబర్ 12 : సంగ్మా పుణ్యతిథి నేపథ్యంలో మేఘాలయలో బ్యాంకుల బంద్.
డిసెంబర్ 13 : రెండో శనివారం కావడంతో హాలీడే.
డిసెంబర్ 14 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
డిసెంబర్ 18 : ఉసోసో థామ్ పుణ్యతిథి సందర్భంగా మేఘాలయలో హాలీడే.
డిసెంబర్ 19 : విముక్తి దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 20 : లూసూంగ్, నామ్సూంగ్ పండుగ సందర్భంగా సిక్కీంలో బ్యాంకుల మూసివేత.
డిసెంబర్ 21 : ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
డిసెంబర్ 22 : లుసూంగ్, నామ్సూంగ్ పండుగల సందర్భంగా సిక్కీంలో హాలీడే.
డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్ సందర్భంగా నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకుల మూసివేత.
డిసెంబర్ 25 : క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.
డిసెంబర్ 26 : క్రిస్మస్ సందర్భంగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో సెలవులు.
డిసెంబర్ 27 : నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు.
డిసెంబర్ 28 : ఆదివారం కావడంతో బ్యాంకుల మూసివేత
డిసెంబర్ 30 : యుకియాంగ్ నంగ్బా పుణ్యతిథి నేపథ్యంలో మేఘాలయలో సెలవులు.
డిసెంబర్ 31 : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మిజోరాం, మణిపూర్‌లో హాలీడే.



