Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంమైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన బాను ముష్తాక్

మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన బాను ముష్తాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎట్ట‌కేల‌కు మైసూరు దసరా ఉత్సవాలను బుక‌ర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్ ఘ‌నంగా ప్రారంభించారు. చాముండేశ్వ‌రీ ఆల‌యంలో సీఎం సిద్ద‌రామ‌య్యతో క‌లిసి ద‌స‌రా ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేము ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన ద‌స‌రా మేళాను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని, త‌న స్నేహితులు ఒక్క‌రోజు ఇక్క‌డి తీసుకెళ్తామ‌ని చెప్పార‌ని, కానీ చాముండేశ్వ‌రీ మాత త‌న ఈరోజు ర‌ప్పించింద‌ని, త‌న జీవితంలో ఈరోజు చిర‌స్మ‌ర‌ణీయంగా గుర్తుండిపోతుంద‌న్నారు. క‌ర్నాట‌క ప్ర‌జ‌ల ఐక్య‌మ‌త్యానికి నిద‌ర్శ‌నం ఈ ద‌స‌రా ఉత్సావాల‌ని కొనియాడారు. ఏ మ‌త‌మైనా మాన‌వ‌త్వాన్ని పెంచిపోషించామ‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు శాంతియుతంగా జీవించాల‌నే కోరుకుంటాయ‌ని ఆయ‌న తెలియ‌జేశారు. ప‌లు స‌వాల్ ఎదురైన‌ప్ప‌టికీ ఈ వేడుక‌లకు త‌న‌ను ఆహ్వానించినంద‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అంత‌కుముందు ఆమెను శాలువ‌తో సీఎం సిద్ద‌రామ‌య్య స‌న్మానించి, ద‌స‌రా ఉత్స‌వాల జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

నెల 22న అట్టహాసంగా మొదలయ్యే మైసూరు దసరా ఉత్సవాలకు బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముష్తాక్‌ను కర్నాటక ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉత్సవాలను ప్రారంభించడం, పూజల్లో పాల్గొనడమనే రెండు అంశాలున్నాయంటూ పిటిషనర్‌ తరఫు లాయర్‌ పేర్కొన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

మైసూరు దసరా ఉత్సవాలకు బాను ముష్తాక్‌ను ఆహ్వానించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాలను మత కోణంలో చూడరాదన్నారు. అందరినీ కలుపుకుని పోయేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందని ఎక్స్‌లో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -