23 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఆగస్టు 16 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు
షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఆర్క్ కోర్సులో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 21న విడుదల కానుంది. గురువారం బీఆర్క్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి, బీఆర్క్ ప్రవేశాల కన్వీనర్ ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీఆర్క్ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పరిశీలన కోసం ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల (ఎన్‌సీసీ, సీఏపీ, వికలాంగులు, స్పోర్ట్స్)కు వచ్చేనెల నాలుగో తేదీన భౌతికంగా ధ్రవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అదేనెల ఏడున రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని వివరించారు. 14న ర్యాంకులను కేటాయిస్తామని తెలిపారు. అదేనెల 16 నుంచి 18 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 20న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 21,22 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. 23న ఖాళీ సీట్ల వివరాలను కాలేజీలు కన్వీనర్‌కు పంపించాలని తెలిపారు. వచ్చేనెల 24,25 తేదీల్లో రెండో విడతలో వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. 28న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 29, 30 తేదీల్లో కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
30న ఖాళీ సీట్ల వివరాలను కాలేజీలు కన్వీనర్‌కు పంపించాలని కోరారు. సెప్టెంబర్ ఒకటి నుంచి బీఆర్క్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఒక యూనివర్సిటీ కాలేజీ, ఎనిమిది అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 508 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర వివరాలకు ఈనెల 21 నుంచి ష్ట్ర్‌్‌జూర://baతీషష్ట్రaసఎ.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
21న బీఆర్క్ ప్రవేశాల నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES