నవతెలంగాణ – జుక్కల్
జక్కల్ మండలంలోని గ్రామాలలో కుల మతాలకతీతంగా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పడంపల్లి , జుక్కల్ , బస్వాపూర్ , కత్తల్వాడి , చెండేగావ్ , మాదాపూర్ , హంగార్గా, పెద్దగుల్లా , గుండూర్ , కౌలాస్ , ఖండేబెల్లుర్ , కేమ్రాజ్ కల్లాలి , చిన్న ఏడిగీ , లాడేగాం , నాగల్ గావ్ , దోస్పల్లి , బంగారుపల్లి , మహ్మదాబాద్ గ్రామాలలో గ్రామ వీర సేవ లింగాయత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బసవేశ్వర చిత్రపటాలకు పూలవాలు వేసి ఘనంగా జయంతి వేడుకలు ప్రారంభించారు. గ్రామాలలో బసవేశ్వరుని చిత్రపటాలను ఎడ్లబండ్లపై ఊరేగింపుగా గ్రామా పురవీధులలో తిప్పుతూ బసవేశ్వర నామకరణ చేస్తూ భాజా భజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రేమతత్వం , సమానత్వం బసవతత్వం, ప్రబోధించిన మహాత్మా బసవేశ్వరుడి జయంతి బుధవారం అక్షయ తృతీయ రోజున జరుపుకోవడం భక్త జనులకు అందరికీ విరశైవ లింగాయత్ మండల సమాఖ్య తరఫున ప్రతి ఒక్కరికి అన్ని మతాల వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. నాడు అణగారిన కులాల వారికి ఒక్కతాటిపై నడిపించి లింగ వివక్షను రూపుమాపిన ఆదర్శమూర్తి బసవేశ్వరుడని, వారి ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు నిరంతర కృషి చేస్తోంది. బసవిశ్వరుని బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ అశేషరని ఆసియా సాధనలు కొనసాగించి, కృషి చేయాలని అన్నారు . అదేవిధంగా జుక్కల్ మండల కేంద్రంలో బసవేశ్వర చౌకు వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ప్రజా ప్రతినిధులు ఘనంగా జయంతి వేడుక లలో పాల్గొన్నారు . గ్రామ గ్రామాన మహా అన్న ప్రసాదాలు పంచి పెడుతూ పేద ప్రజలకు , బడుగు , బలహీన వర్గాల వారికి కలుపుకొని కలిసిమెలిసి ఉన్నప్పుడే బసవేశ్వరుడు సంతోషిస్తారు అనే ఉద్దేశంతో అన్నదానాలు నిర్వహించారు.
ఘనంగా బసవ జయంతి వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES