నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికుడు జి. కిసాన్ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుముశారు. కార్మికుని మృతి తెలిసిన వెంటనే కార్మికుడు కిషన్ ఇంటికి వెళ్లిన గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ, ఉప సర్పంచ్. బి. అనిల్, వార్డ్ సభ్యులు. ఎం. సంగ్రాట్, కె. మలుగొండ, ఏ. శివాజీ పటేల్, తాటి బాబు, ఎల్. బీరుగొండ, షేక్. హైదర్, ఎం. నాగనాథ్, బి రాములు, సచిన్ తదితరులు కలిసి వెళ్లి కిషన్ భౌతికాయానికి పూల దండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కిషన్ కుటుంబ సభ్యులను పలకరించి మనో ధైర్యం కల్పించారు. గ్రామ పంచాయతీ తరపున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు అందించారు. వీరితోపాటు. గ్రామ పంచాయతీ కార్యదర్శి భారద్వాజ, కారోబార్. ఎం. గంగారం, వాటర్ మాన్ వీరేశం, ట్రాక్టర్ డ్రైవర్. రాజు, పారిశుద్ధ్య కార్మికుడు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు
అనారోగ్యంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి..
- Advertisement -
- Advertisement -



