- Advertisement -
నవతెలంగాణ-వెల్గటూర్ : మండలం లోని పైడిపల్లి గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పూల వాసనలతో గ్రామం నిండిపోయింది. మహిళలు, బాలికలు సంప్రదాయ పూల దండలు, రంగురంగుల చీరలతో తీరొక్కిన వేదికలపై బతుకమ్మలను ప్రతిష్ఠించి పాటలతో వాతావరణాన్ని మార్మోగించారు.గ్రామంలో ప్రతీ వార్డు లో స్థానిక కాలనీవాసులు, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ బహిరంగ వేదికలు ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా వందలాది మహిళలు, గునుగు, పట్టుగుచ్చు, బంతిపూలతో పూవులు, తంగేడు పూలతో బతుకమ్మలను అలంక రించి, జాతి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్వహించారు.
- Advertisement -