- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహాలో బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.
- Advertisement -