నవతెలంగా – కంఠేశ్వర్
రాష్ట్ర ప్రజాసాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ ను నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా విడుదల చేశారు. పోస్టర్‌ను మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అనురాధ గారు, తెలంగాణ గెజెటెడ్ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, టీజీవో మహిళా విభాగం చైర్ పర్సన్ జయంతి కుమారి సంయుక్తంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబిస్తుందని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థినులు ఈ పండుగను సాంస్కృతిక ఉత్సవంగా భావించి ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పవనీ, నాగరాజు, చంద్ర, విజ్నేష్ ఏవో, సరస్వతి, విజయత, శ్రీతిల, సుజాత పాల్గొన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES