- Advertisement -
నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ : 18న తలపెట్టిన బీసీ బందును జయప్రదం చేయాలని కల్వకుర్తి లో బిసి సబ్ ప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం జేఏసీ శిబిరం వద్ద బిసి బంద్ పోస్టర్ను విష్కరించారు. ఈనెల 18న జరిగే బిసి బందును సబండ వర్గాలు మద్దతు తెలిపి బందును జయప్రదం చేయాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బిసి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని బీసీలకు 42 శాతం వాటా వచ్చేవరకు పోరాటం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిసి సబ్ ప్లాన్ సాధన సమితి అధ్యక్షులు మ్యాకల రాజేందర్, జేఏసీ కన్వీనర్ సదానందం గౌడ్, జంగయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -