- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ రద్దు కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను బీసీసీఐ బెంగళూరు నుంచి లక్నోకి మార్చింది. బెంగళూరులోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేదిక మార్చాల్సి వచ్చింది. “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంకు మార్చారు” అని బీసీసీఐ మంగళవారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
- Advertisement -