Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఐపీఎల్ ముగింపు వేడుకను భారత సైన్యానికి అంకితం చేయనున్న బీసీసీఐ

ఐపీఎల్ ముగింపు వేడుకను భారత సైన్యానికి అంకితం చేయనున్న బీసీసీఐ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు ఉత్సవాలను భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ముగింపు వేడుక జరగనుంది. సుమారు 45 నిమిషాల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సాయుధ బలగాల సేవలకు గుర్తుగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా బీసీసీఐ ప్రతినిధి సైకియా మీడియాతో మాట్లాడుతూ, “‘ఆపరేషన్ సిందూర్’లో మన సాయుధ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవలకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. వారి వీరోచిత కృత్యాలు దేశానికి స్ఫూర్తినిస్తూ, మనల్ని కాపాడుతున్నాయి. వారికి నివాళిగా, ఐపీఎల్ ముగింపు వేడుకను సాయుధ బలగాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. క్రికెట్ మన దేశంలో ఒక మక్కువ కావచ్చు, కానీ దేశం, దాని సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రత కంటే ఏదీ గొప్పది కాదు. మన సాయుధ బలగాల పట్ల మేమెంతో గర్వపడుతున్నాం… వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad