Tuesday, March 10, 2026
E-PAPER
Homeఆటలుటీమ్‌ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా

టీమ్‌ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.131 కోట్ల కానుక ఇస్తున్నట్లు తెలిపింది. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌పై భారత్‌ 96 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మొత్తంగా టీ20ల్లో భారత్‌ మూడోసారి ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. అంతేకాకుండా స్వదేశంలో టోర్నీ నెగ్గిన తొలి జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లకు, సిబ్బందికి, సెలక్టర్లకు బీసీసీఐ మరోసారి అభినందనలు తెలిపింది.        

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -