నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీంను 100 పరుగుల తేడాతో యంగ్ ఇండియా ఓడించిన విషయం తెలిసిందే. తుది పోరులో వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ 411 రన్స్ చేసింది. చేదనలో బ్రిటన్ ఆటగాళ్లు 40 ఓవర్లకే కూప్పకూలి 310 రన్స్ కు ఆలౌట్ అయి ట్రోఫిని చేజార్చుకున్నారు. తాజాగా యువ భారత్ జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది.
విజేత జట్టు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ.7.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ నగదు బహుమతిని ఎవరికి ఎంత పంచాలనే దానిపై వివరాలను ఖరారు చేస్తున్నామని, మొత్తం రివార్డ్ మాత్రం రూ.7.5 కోట్లు అని ఆయన ఐఏఎన్ఎస్‌కు తెలిపారు.
అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో అండర్-19 జట్టు విజయం పట్ల యావత్తు దేశంతో పాటు BCCI గర్వంగా భావిస్తోందని, ఫైనల్స్‌లో మన జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించిన తీరు అద్భుతం. మెరుగైన ప్రదర్శనకు ఆ జట్టుకు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని అందజేస్తున్నామని BCCI వెల్లడించింది.



