అన్సన్ పల్లి లో మలేరియా ఉచిత క్యాంప్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆన్సన్ పల్లి గ్రామం లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించి తొలగించారు. ఈ శిబిరం ను ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ క్రిస్టినా ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులలో ఈగలు, దోమల వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా,ఫైలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.
గ్రామంలో గ్రామ పంచాయతీ అద్వర్యంలో 100 ఇండ్ల చుట్టూ గల పరిసర ప్రాంతాలలో డెమో పాస్ స్ప్రే చేయించి, ఇంటింటికి జ్వరం సర్వే ఆశా కార్యకర్తలచే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, పంచాయతీ కార్యదర్శి అశ్వంత్,ఎం. ఎల్. ఎచ్. పి. ఎ. లేయా,ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, మలేరియా సభ్ యూనిట్ అధికారి రాజేందర్, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, మమత, ఇందిరా ఆశా కార్యకర్తలు భాగ్య, జుబేదా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.