Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనేటి నుంచి బార్డ‌ర్‌లో బీటింగ్ రీట్రీట్

నేటి నుంచి బార్డ‌ర్‌లో బీటింగ్ రీట్రీట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో పాకిస్థాన్‌ సైనికులతో ‘బీటింగ్‌ రీట్రీట్‌’ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులోని మూడు చెక్‌పోస్టులు – అటారీ-వాఘా (అమృత్‌సర్‌), హుస్సేన్‌వాలా (ఫిరోజ్‌పుర్), సద్కి (ఫజిల్కా) వద్ద ‘బీటింగ్ రీట్రీట్’ వేడుకలు నేటినుంచి తిరిగి ప్రారంభమవుతాయని బీఎస్‌ఎఫ్‌ (BSF) అధికారులు తెలిపారు. అయితే దీనిపై పలు ఆంక్షలు విధించారు. జెండా అవనతం ప్రక్రియ సమయంలో బార్డర్‌ గేట్లను తెరవబోమని.. బీఎస్‌ఎఫ్‌ దళాలు పాక్‌ రేంజర్లతో కరచాలనం చేయవని చెప్పారు. ఈ కార్యక్రమం సమయాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. తొలిరోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని.. రేపటి నుంచి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని తెలిపారు. మే 8 నుంచి సైనిక దళాలు ప్రతిరోజూ జెండాను అవనతం చేస్తున్నాయని .. కానీ ప్రజల భద్రత దృష్ట్యా బీటింగ్‌ రీట్రీట్‌, ప్రజలకు ప్రవేశం వంటివాటిని నిలిపివేశామని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad