Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలువివాదంలో అందాల పోటీలు

వివాదంలో అందాల పోటీలు

- Advertisement -

వేశ్యకన్నా అధ్వానంగా చూశారు
మనస్తాపంతో హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చాను : మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగి సంచలన ఆరోపణ
ఆమె ఆరోపణలు అవాస్తవం
తల్లి ఆరోగ్యం బాగాలేదని పోటీల నుంచి తప్పుకుంది : మిస్‌ వరల్డ్‌ సీఈవో జూలియా మోర్లే వివరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కొత్త వివాదం నడుస్తోంది. నిర్వాహకుల తీరు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోటీల్లో పాల్గొం టున్న పోటీదారులకు మింగుడు పడటం లేదు. మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి తప్పుకున్నానని పేర్కొంటూ మే16న ఆమె ఇంగ్లాండ్‌ వెళ్లిపోయారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మిస్‌వరల్డ్‌ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రఖ్యాత సన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మధ్య వయస్సున్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చారనీ, తమను వేశ్యకంటే అధ్వానంగా చూశారంటూ ఆమె నిర్వాహకులపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మనస్తాపంతో హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చినట్టు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్‌ అవుతున్నాయి.
ఆరోపణలు అవాస్తవం : జూలియా మోర్లే
మిస్‌ వరల్డ్‌ పోటీల నుంచి తప్పుకుని స్వదేశం వెళ్లిన మిస్‌ ఇంగ్లాండ్‌ 2025 మిల్లా మాగీ చేసిన ఆరోపణలను నిర్వాహకులు కొట్టి పారేశారు. ఈ మేరకు శనివారం మిస్‌ వరల్డ్‌ సీఈవో జూలియా మోర్లే ఒక ప్రకటన విడుదల చేశారు. ”మే మొదటి వారంలో మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా తన తల్లి ఆరోగ్యం బాగా లేనందున పోటీల నుంచి విరమించుకుంటున్నట్టు సంస్థకు తెలిపారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేశాం. పోటీల నుంచి వైదొలిగిన తర్వాత, మిస్‌ ఇంగ్లాండ్‌ రన్నరప్‌ మిస్‌ షార్లెట్‌ గ్రాంట్‌ ఇంగ్లాండ్‌ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారు. ఆమె పోటీలో పాల్గొనేందుకు అను మతిచ్చాం” అని మోర్లే తెలిపారు. బ్రిటిష్‌ మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలో అనుభవా లపై తప్పుడు, కథనాలను ప్రచు రిస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ నిజా యితీ, గౌరవం, ”బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌” అనే విలువలకు అద్దం పట్టేలా పోటీలు కొనసాగు తున్నాయని తెలిపారు. మీడియా సంస్థలు జర్నలిస్టిక్‌ విలువలు పాటిస్తూ, తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని కోరారు.
వేధించిందెవరు?
ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరన్న విషయం తెలియాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ వేధింపులకు కారణమైంది ఎవరు? ఆనంద పెట్టాలని నిర్వాహకులు ఎవరి కోసం వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు? ఆ వ్యక్తులు ఎవరు? ఈ అంశాలన్నీ బయటకు రావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మిల్లా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపితే గానీ వాస్తవాలు బయటరావు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే అనేక అనుమానా లకు తావిచ్చినట్టవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -