నవతెలంగాణ-హైదరాబాద్: నల్లులున్నాయి.. ఆఫీసును తాత్కాలికంగా మూస్తున్నాం ” అని గూగుల్ సంస్థ తన ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది. మాన్‌హట్టన్ చెల్సియా క్యాంపస్‌లోని గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద కలిగింది. గూగుల్‌కు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు ఈనెల 19న తమ ఉద్యోగులకు ఓ ఈమెయిల్‌ను పంపించారు. దాని ప్రకారం.. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లు స్నీపర్ డాగ్ గుర్తించిందని తెలిపారు. దీంతో ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు ఉద్యోగులు రావద్దు అని తెలిపారు. ఈ క్రమంలో నల్లుల నివారణకు కార్యాలయం చర్యలు చేపట్టింది.
సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతిచ్చింది. ఇక, నల్లులకు సంబంధించి దురద లాంటి లక్షణాలు ఏమైనా బయటపడితే వెంటనే తెలియజేయాలని కోరింది. తమ ఇళ్లల్లో నల్లులు కన్పిస్తే.. వాటి నివారణకు సంబంధించిన ప్రొఫెషనల్స్‌ను సంప్రదించాలని సూచించింది. న్యూయార్క్‌లోని గూగుల్ ఆఫీసులో పెద్ద మొత్తంలో జంతువుల బమ్మలు ఉంచడం వల్లే ఇది వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు తెలిపాయి. నల్లుల బారినపడి.. ఏవైనా లక్షణాలు కనిపిస్తే దానికి సంబంధించిన నివేదికలు అందజేయాలని ఉద్యోగులకు సూచించింది. దీంతోపాటు పనిచేసే ప్రాంతంలో వాటిని ఎక్కడైనా గుర్తించినట్లయితే తెలిపాలని పేర్కొంది. ఇక, న్యూయార్క్‌లోని గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. 2010లో కూడా ఇలాంటిదే జరిగింది.