నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. గురువారం అరెస్ట్ చేశారు. మరోవైపు హీరో సాయిపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఎంత సినిమా హీరో అయితే మాత్రం రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కారు నడపొచ్చా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ‘అల్లుడి శీను’తో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కవచం, రాక్షసుడు, జయ జానకీ నాయకా, సాక్ష్యం.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే ఊపులో హిందీ ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేశాడు. అది కాస్త డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం భైరవం అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్‌లు కూడా నటిస్తున్నారు.
పోలీసులు అదుపులో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES