– గిఫ్ట్ సిటీ ద్వారాఎన్ఆర్ఐలకు యూఎస్‌డీ ఫిక్స్‌డ్డిపాజిట్లను అందించిన తొలిఫిన్‌టెక్
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐలు) కోసం ప్రత్యేకంగా నిర్మించిన తొలి ఫిన్‌టెక్ యాప్ ‘బిలాంగ్’, ఈ రోజు యూఏఈలో తన అధికారిక ప్రారంభాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ జనాభాలో సుమారు 22% ఉన్న యూఏఈ, ఎన్ఆర్ఐల యొక్క అతిపెద్ద కేంద్రాల్లో ఒకటి. భారతదేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం గిఫ్ట్ సిటీ ద్వారా, ఎన్ఆర్ఐలకు యూఎస్‌డీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందించిన తొలి ఫిన్‌టెక్‌గా బిలాంగ్ నిలిచింది.
ఈ ప్రారంభంతో, యూఏఈలోని ఎన్ఆర్ఐలు ఇప్పుడు బిలాంగ్ యాప్ ద్వారా నేరుగా భారతదేశంలోని విశ్వసనీయ బ్యాంకుల్లో యూఎస్‌డీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టగలుగుతారు. ఈ డిపాజిట్లు భారతదేశంలో పన్ను రహిత రాబడి, రూపాయి క్షీణత నుండి రక్షణ, తక్కువ వ్యవధి పెట్టుబడి అవకాశాలు కలిగించడంతో పాటు, ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాల అవసరాన్ని తొలగిస్తాయి. అలాగే, పూర్తిగా తిరిగి పంపించుకునే అవకాశాన్ని అందిస్తాయి. డోర్‌స్టెప్ KYC సేవలను అందిస్తూ, బిలాంగ్ ఈ అనుభవాన్ని సులభతరం చేస్తుంది. అదనంగా, సాధారణంగా ఎన్ఆర్ఐలకు అధిక ఖర్చుతో అందే సేవలను బిలాంగ్ పారదర్శకంగా, ఖర్చు సమర్థవంతంగా అందిస్తూ, ప్రత్యేక భారత పన్ను ఫైలింగ్ సేవను కూడా ప్రారంభించింది.
ఈ ప్రారంభం ఎలివేషన్ క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన ( అమెరికన్ డాలర్) $ 5 మిలియన్ సీడ్ ఫండింగ్ రౌండ్ ద్వారా సమర్థించబడింది. ఇందులో రిలెంట్‌లెస్ వెంచర్స్ మరియు ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్లు అభిరాజ్ సింగ్ భల్, వరుణ్ ఖైతాన్ (అర్బన్ కంపెనీ), అక్షంత్ గోయల్ (జొమాటో), వరుణ్ అలఘ్ (మామాఎర్త్), వినీత్ సేథి (పేయూ), అదిత్య శర్మ (మెకిన్సీ) పాల్గొన్నారు.
బిలాంగ్, ఎన్ఆర్ఐలు భారతదేశంలో పెట్టుబడులు చేయడంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలను పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి:
– సంక్లిష్టమైన KYC ప్రక్రియలు
– అననుకూల పెట్టుబడి వ్యవధులు
– కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల తక్కువ రాబడి
– పన్నుల సంక్లిష్టత
– రీపాట్రియేషన్ సమస్యలు
గత 5 సంవత్సరాలలో భారతదేశానికి వచ్చే రెమిటెన్స్ 2019లో(అమెరికన్ డాలర్) $82 బిలియన్ నుండి 2024లో ( అమెరికన్ డాలర్) $129 బిలియన్‌కి పెరిగినప్పటికీ, మ్యూచువల్ ఫండ్ AUMలో ఎన్ఆర్ఐల వాటా 2.9% నుండి 2.3%కి తగ్గింది. ఇది ఎన్ఆర్ఐలు పెట్టుబడి చేయాలన్న ఆకాంక్ష ఉన్నా, ప్రక్రియ కష్టతరంగా ఉందని సూచిస్తుంది.
గిఫ్ట్ సిటీలో లైసెన్స్‌లను పొందిన బిలాంగ్, ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ఎన్ఆర్ఐలకు పెట్టుబడి మార్గాలను సులభతరం చేస్తుంది. ఇది గిఫ్ట్ సిటీలో:
– పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (PSP)
– బ్రోకర్ డీలర్ లైసెన్స్‌లను పొందిన తొలి లైసెన్స్‌డ్ ఫిన్‌టెక్ సంస్థగా నిలిచింది.
ప్రారంభంలో యూఎస్‌డీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందించిన బిలాంగ్, త్వరలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇన్సూరెన్స్, కార్డులు వంటి ఇతర ఆర్థిక ఉత్పత్తులను కూడా జోడించనుంది. ఇవి ఎన్ఆర్ఐలకు మరింత లాభదాయకమైన పెట్టుబడులు, లావాదేవీ ఎంపికలు అందించగలవు. బిలాంగ్ ఇప్పటికే ఎన్ఆర్ఐల కోసం సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాల కోసం డిజిటల్ సాధనాల సూట్‌ను అందిస్తోంది. ఈ సేవలు బిలాంగ్ దృష్టిని ప్రతిబింబిస్తాయి. ఎన్ఆర్ఐ జీవితాన్ని సులభతరం చేయడం.
బిలాంగ్ అనేది బీటాఫ్రంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు దాని సబ్సిడియరీలకు చెందిన ఫిన్‌టెక్ బ్రాండ్. ఇది ఐఎఫ్‌ఎస్‌సీఏ లైసెన్స్‌ను పొందిన సంస్థగా గిఫ్ట్ సిటీలో మరియు వెలుపల క్రాస్-బోర్డర్ లావాదేవీలు చేయడానికి అనుమతించబడిన తొలి మూడింటిలో ఒకటి.
బిలాంగ్ సహ-స్థాపకుడు, CEO అంకుర్ చౌధరి మాట్లాడుతూ
“భారతదేశం నుండి దూరంగా ఉండటం తనదైన సవాళ్లను తెస్తుంది. సంక్లిష్ట క్రాస్-బోర్డర్ బ్యాంకింగ్ నుండి రిమోట్‌గా పెట్టుబడులను నిర్వహించడం వరకూ. ప్రతి ఎన్ఆర్ఐ కఠిన శ్రమతో ప్రపంచ గుర్తింపును పొందాడు. కానీ ఆర్థిక సేవలు ఈ వేగానికి తగ్గట్టు అభివృద్ధి చెందలేదు.