- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్స్టాలో ఆయన ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు “Get well soon” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -



