Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంనవతెలంగాణ ఖమ్మం రీజియన్ మేనేజర్ కు పితృ వియోగం

నవతెలంగాణ ఖమ్మం రీజియన్ మేనేజర్ కు పితృ వియోగం

- Advertisement -

నవతెలంగాణ-ఖమ్మం: నవతెలంగాణ ఖమ్మం రీజియన్ మేనేజర్ ఎస్డి జావెద్ తండ్రి జియాయుద్దీన్ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మృతదేహాన్ని నవతెలంగాణ ఖమ్మం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, విలేకరులు, సిబ్బంది సందర్శించి నివాళి అర్పించారు. మృతదేహాన్ని ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ లో వారి స్వగృహంలో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జియాయుద్దీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. బిడ్డలకు అత్యంత నాణ్యమయిన మెనూ అందించి, ఐటీడీఏ ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదివాసి పిల్లలకు మంచి చదువును అందించడంలో టీచరుగా, ఆశ్రమ స్కూల్ హెడ్మాస్టర్ గా, వార్డెన్ గా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.

ఉపాధ్యాయులుగా చింతూరు మండలం గూడూరు మొదలుకొని, వీఆర్ పురం మండలం సోములగూడెం, భద్రాచలం మండలం కొత్తూరు నారాయణపురం వరకూ ఏజెన్సీ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేశారు పని చేసారు. రిటైర్మెంట్ తర్వాత సీపీఐ(ఎం) ఆడిటర్ గా భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులుగా, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులుగా విశేష సేవలు అందించారు.

నవతెలంగాణ సీజీఎం, ఎడిటర్ సంతాపం
నవతెలంగాణ ఖమ్మం రీజియన్ మేనేజర్ ఎండీ జావెద్ తండ్రి జియాయుద్దీన్ మరణించారని తెలుసుకున్న నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్ సంతాపం తెలిపారు. ప్రజాతంత్ర ఉద్యమాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన జియాయుద్దీన్ మరణం తీరని లోటని పేర్కొన్నారు. జావెద్ కుటుంబానికి ప్రగాఢ సహానుభూతిని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad