Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమా‘చెట్టు = తల్లి’ షార్ట్ ఫిలింకు ఉత్తమ చిత్రం అవార్డు

‘చెట్టు = తల్లి’ షార్ట్ ఫిలింకు ఉత్తమ చిత్రం అవార్డు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ప్రగతీనగర్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో శ్రీశ్రీ చిత్రశాల ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిమ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

అనంతపురం షార్ట్ ఫిలిమ్స్–2026 పోటీలలో భాగంగా నిర్వహించిన వివిధ విభాగాల పోటీలలో, కళాంజలి అనంత్ రచన–దర్శకత్వం వహించిన ‘చెట్టు = తల్లి’ షార్ట్ ఫిలిం ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డుకు ఎంపికైంది.

ఈ కార్యక్రమంలో ఈ అవార్డును అనంతపురం షార్ట్ ఫిలిమ్స్ అభివృద్ధి నిర్వాహకులు రషీద్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణ నంది అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు సాదనాల వెంకటస్వామి నాయుడు చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో రచయిత డా. కె.కె.ఆర్. మూర్తి, తెలంగాణ పాటల రచయిత్రి, గాయని వలజ బాల, సినీ దర్శకుడు సాని, సుందరయ్య విజ్ఞాన భవన్ కన్వీనర్ సి.హెచ్. మల్లయ్య చారి, ‘నాన్న’ షార్ట్ ఫిలిం నాన్న పాత్రధారి, ఉత్తమ నటుడు వి. మునిచంద్ర, సుందరయ్య భవన్ కోశాధికారి కె. బాల వెంకటేశ్వర్లు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -