నవతెలంగాణ-హైదరాబాద్: పదో సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితిష్ కుమార్‌కు ఆర్జేడీ అగ్రనేత, ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత తేజస్వీయాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొలువు దీరిన కొత్త ప్రభుత్వం ప్రజా అనుకూల, నిజమైనా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఈమేరకు గురువారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా ఏన్డేయే ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని ఆయన కోరారు.
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు హాజరైయ్యారు. నితీశ్ కుమార్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డేయే కూటమి 202 స్థానాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది.మహాగఠ్‌బంధన్ 35 సీట్లు సాధించింది.



