ప్రీ ప్రైమరీ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ – దుబ్బాక
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యా బోధన అందుతుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సర్కారు స్కూళ్ల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యల్ని చేపడుతుందని, అందులో భాగంగానే ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్థులు ప్రీ ప్రైమరీ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ లో ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటుచేసిన “ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్” ను ఎంఈఓ దోమకొండ అంజయ్య తో కలిసి ఆయన ప్రారంభించారు.
ద్యార్థుల సంఖ్యను 31 నుంచి 82 కు పెంచేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించి శాలువాలతో సన్మానించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం గ్రామానికి చెందిన పలువురు దాతలు రూ.60 వేలు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. తనవంతుగా రూ.10 వేలను ఎంఈఓ అంజయ్యకు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, బుక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ విద్యుత్తు ఏఈ కనకయ్య, తాజా మాజీ సర్పంచ్ పోతనక రాజయ్య, కూతురు కుమార్, రాజమల్లయ్య, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యా బోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES