- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో C.I.D. దర్యాప్తు ముమ్మరం చేసింది. యోలో 247 యాప్ ప్రచారంపై మంచు లక్ష్మి స్టేట్‌మెంట్‌ను మంగళవారం సీఐడీ రికార్డు చేయనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద, బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చేశారనే కోణంలోనూ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేసులు నమోదు చేసి సీఐడీ విచారణ చేపట్టింది.
- Advertisement -



