Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోన్ పే, గూగుల్ పేతో తస్మాత్ జాగ్రత్త 

ఫోన్ పే, గూగుల్ పేతో తస్మాత్ జాగ్రత్త 

- Advertisement -

డబ్బులు వచ్చినట్లు మెసేజ్ వస్తది కానీ అకౌంట్ లో యాడ్ కావు 
ఇదొక కొత్త రకం సైబర్ 
నవతెలంగాణ  – మిరుదొడ్డి 

వ్యాపారస్తులు, ప్రజలు ఫోన్ పే గూగుల్ పే తో తగు జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులు, వాహనదారులు ప్రజలు కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరస్తులు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్లే పంపిస్తూ మెసేజ్ వస్తుంది. కానీ వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ కావు. ఇదొక రకమైన మోసాన్ని చేస్తున్నారు. కొంతమంది కేటుగాళ్లు. దుబ్బాక నియోజకవర్గం లో గత కొన్ని రోజులుగా కిరణం షాపుల్లో ,వాహనదారులు మరియు దుకాణాల వద్ద ఫోన్ పే డబ్బులు చేసినట్టే చేస్తున్నారు. కానీ డబ్బులు జమ కావడానికి పోవడంతో వ్యాపారస్తులు సంబంధిత వారిని నిలదీయడం జరిగింది.

ఇది ఎలా అని ప్రశ్నిస్తే వారు నాకేం తెలవదని ఎండు ముఖం పెట్టారు. ఒక ఆటో వ్యాపారి బెడ్ ప్యాకెట్లు అమ్ముతూ సుమారుగా రూ.3000 వస్తువులు కిరాణా షాపులో వేయగా అక్కడ ఉన్న వ్యక్తి ఫోన్ పే ద్వారా డబ్బులు  పంపించారు. కానీ ఒక బెడ్ ప్యాకెట్ వ్యాపారికి డబ్బులు జమ కావడంతో రెండు రోజుల తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఆ యొక్క వ్యాపారిని నిలదీశారు. అదే మాదిరిగా చాలామంది కేటుగాళ్లు ఫోన్పే గూగుల్ పే చేయడం జరుగుతుంది డబ్బులు జమ కాకపోవడం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్త ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -