ఫిక్సర్‌గా ‘రానా నాయుడు’ మళ్లీ తిరిగొ చ్చాడు. అయితే ఈసారి తన కుటుంబం కోసం. 2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’ ఎంత పెద్ద ఆదరణ పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్2’ మన ముందుకు రానుంది. గతసారి కంటే కఠినమైన, చీకటి పొరలను కలిగిన అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. ఈసారి ఫిక్సర్ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
సాధారణంగా తన క్లైంట్స్ కోసం సమస్యలను సాల్వ్ చేసి రానా నాయుడు ఈసారి తన కుటుంబం కోసం రంగంలోకి దిగుతాడు. కుటుంబం ప్రమాదంలో ఉన్నప్పుడు నియమ నిబంధనలకు సంబంధించిన హద్దులను అతను ఎలా దాటాడు అనేదాన్ని సీజన్2లో మీరు చూడబోతున్నారు. సీజన్1లో ప్రేక్షకులు రానా నాయుడు అనే అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళారు. ప్రపంచంలో ఎలాంటి పనినైనా చేయగల రానా, తన తండ్రిని మాత్రం ఎదుర్కొనలేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సందర్భంలో కొడుకు జీవితంలోకి నాగనాయుడు ప్రవేశించాల్సి వస్తుంది. ఎవరికీ తెలియని ఓ గతాన్ని మోసే టైమ్‌బాంబ్‌లాంటి వ్యక్తి నాగ నాయుడు. సీజన్1 కంటే సీజన్2లో మరింత తీవ్రతరమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఈసారి వారు ఎదుర్కొనబోయే ప్రమాదం వారి వ్యక్తిగతమైనది. పాత గాయాలకు పగ తీర్చుకోవాలని గతం కోరుకుంటుంది. రవూఫ్- రానాకు సమానమైన శత్రువు. తన పగను తీర్చుకోవటానికి ఎలాంటి పనినైనా చేయటానికి వెనుకాడడు.
రానా చిట్టచివరగా ఓ ప్రమాదకరమైన పనిని ఫిక్స్ చేయాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను చివరి వరకు చేరుకుంటాడు. అది విజయవంతమైతే అతని కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. అయితే రవూఫ్ రూపంలో అనుకోని తుపాన్ ఎదురవుతుంది. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. దారులు మూసుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లను రానా అదుపులోకి తెచ్చుకోగలడా? లేక ఇబ్బంది పడతాడా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
సూర్వీన్ చావ్లా, కతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీజన్2లో ఆకట్టుకునే యాక్షన్, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామాతో పాటు కుట్ర, విమోచనం ఇంకా వాటి మధ్య ఉండే బావోద్వేగాలను ఈ సీజన్‌లో చూడొచ్చు. ఈనెల 13న ఈ సీజన్2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది అని మేకర్స్ చెప్పారు.
అంతకు మించి ‘రానా నాయుడు’ సీజన్ 2
- Advertisement -
- Advertisement -