Thursday, May 29, 2025
Homeసినిమా'భైరవం'.. పండగలాంటి సినిమా

‘భైరవం’.. పండగలాంటి సినిమా

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భైరవం’. విజరు కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. పెన్‌ స్టూడియోస్‌ డాక్టర్‌ జయంతీలాల్‌ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘సినిమా మీ అందరికీ ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఒక మంచి సినిమా చూశామనే శాటిస్ఫాక్షన్‌ ఉంటుంది. డైరెక్టర్‌ విజరు సినిమాని చాలా కష్టపడి తీశారు. ఈ సినిమా ఫైనల్‌ కట్‌ చూశాను. అదిరిపోయింది. మామూలుగా ఉండదు. ఈనెల 30న మనందరికీ పెద్ద పండగ. ఆ పండగలో మీరందరూ భాగం కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘మా నిర్మాత రాధా మోహన్‌ మేము సక్సెస్‌లో ఉన్నామా?, సినిమాలు చేస్తున్నామా? ఇవేవీ లెక్కలేసుకోకుండా కేవలం మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశారు. డైరెక్టర్‌ విజరు చాలా డెడికేషన్‌తో సినిమాలు చేసే వ్యక్తి. ఈ సినిమా విజయం సాధించాలని మేమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను’ అని హీరో మంచు మనోజ్‌ చెప్పారు.
హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ,’డైరెక్టర్‌ విజరు ఈ సినిమాతో మంచి కమర్షియల్‌ డైరెక్టర్‌ అవ్వాలి. మరెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్‌ రాధా మోహన్‌కి సినిమా అంటే చాలా ప్యాషన్‌. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు లైఫ్‌ లాంగ్‌ మెమరీ. సినిమా అనేది కలెక్టివ్‌ ఎఫర్ట్‌. ఈ సినిమాలో పని చేసిన అందరికీ సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మంచి ఘనవిజయాన్ని మా అందరికీ ఇస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్‌ విజరు కనక మేడల మాట్లాడుతూ,’సినిమాలో యాక్షన్‌ నెక్స్ట్‌ లెవెల్‌ ఉంటుంది. శ్రీ చరణ్‌ నెక్స్ట్‌ లెవెల్‌ ఆడియో ఇచ్చారు. 30వ తారీఖున నెక్స్ట్‌ లెవెల్‌ వైబ్‌ ఇవ్వబోతున్నారు. మా నిర్మాత రాధ మోహన్‌ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా ఆడియన్స్‌ అందరికీ నెక్స్ట్‌ లెవెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది’ అని తెలిపారు.

ఈ సినిమా చేయడానికి ముఖ్య కారకులు బెల్లంకొండ సురేష్‌. ఈ సినిమా చేస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చి ముందుకు నడిపారు. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంటే కొందరు భయపడతారు. నేను కూడా ముందు భయపడ్డాను. కానీ మాకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్ళు వచ్చినట్టుగా అనిపించింది (నవ్వుతూ). ఈ సినిమా థియేటర్స్‌లో మరుపురాని ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.
– నిర్మాత రాధామోహన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -