Thursday, June 19, 2025
E-PAPER
Homeసినిమాయూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో 'భైరవం'

యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో ‘భైరవం’

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. పెన్‌ స్టూడియోస్‌ డాక్టర్‌ జయంతీలాల్‌ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఫోన్‌ చేసి, ఈ కథ గురించి చెప్పారు. ఆయన జడ్జిమెంట్‌ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్‌ క్యారెక్టర్‌ నాకు బాగుంటుందని చెప్పారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. తమిళంలో దీన్ని ఒక రస్టిక్‌ విలేజ్‌ డ్రామాలా చేశారు. అయితే దీన్ని మన తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేయడం జరిగింది. ‘గరుడన్‌’ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్‌ ఫిల్మ్‌ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.
సాయిశ్రీనివాస్‌, మనోజ్‌తో ఎప్పటినుంచో పరిచయం ఉంది. పర్సనల్‌గా కూడా మేము చాలా క్లోజ్‌. మా మధ్య చాలా కంఫర్ట్‌ ఉంటుంది. డైరెక్టర్‌ విజరుకి కూడా చాలా క్లారిటీ ఉంది. ఏ క్యారెక్టర్‌ నుంచి ఎలాంటి నటన కావాలో తనకి తెలుసు. మాకు కూడా చాలా ఫ్రీడమ్‌ ఇచ్చాడు. ఇందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి చాలా ఎమోషనల్‌ డెప్త్‌ ఉంటుంది. ఇందులో జయసుధ బామ్మ క్యారెక్టర్‌ చేశారు. ఆమె లెజెండ్‌. ‘సార్‌ వచ్చారు’ తర్వాత ఆమెతో వర్క్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
నేను యాక్షన్‌ సినిమాలు చేశాను. కానీ ఇంత కమర్షియల్‌ మాస్‌ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మేజర్‌ హైలైట్‌. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్‌ చేయడం చాలా ఎంజారు చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ చాలా అద్భుతంగా వచ్చింది.
శ్రీ చరణ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు బాగా చేస్తాడనే పేరు ఉంది. ఈ సినిమాతో మంచి పాటలు కూడా ఇస్తాడని ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్‌ స్కోరు కూడా మెయిన్‌ హైలెట్‌గా ఉంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని ఎలివేట్‌ చేశాడు
రాధా మోహన్‌ లాంటి నిర్మాతలు ఇండిస్టీకి చాలా ఇంపార్టెంట్‌. ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీపడకుండా సినిమా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ రావాలని, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. ‘సుందరకాండ’ దాదాపు పూర్తయింది. జూలైలో రిలీజ్‌ ఉండొచ్చు. నెక్స్ట్‌ ఫిల్మ్‌ ఆగస్టులో ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -